Telangana

రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి

సంగారెడ్డి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచన

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు:

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో సంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ప్రతిభను చాటుకుని ప్రథమ స్థానాన్ని సాధించే దిశగా సమష్టి కృషి చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతకు ప్రోత్సాహం అందించడం ద్వారా జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత మంది క్రీడాకారులు ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 26, 27, 28 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా..వేములవాడ కేంద్రంగా జరగనున్న రాష్ట్ర స్థాయి జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్‌షిప్ పోటీల నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జూనియర్స్ కబడ్డీ జట్టు కోసం పటాన్చెరు డివిజన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణ శిబిరాన్ని మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, వారి ఫిట్‌నెస్‌, ప్రాక్టీస్ విధానం, కోచ్‌ల మార్గదర్శకాలను ఆయన స్వయంగా పరిశీలించారు. క్రీడాకారులతో మాట్లాడి పోటీలకు వారి సన్నద్ధత, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి తెలుసుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రత్యర్థి జట్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు శారీరక దారుఢ్యంతో పాటు వ్యూహాత్మకంగా కూడా సిద్ధం కావాలని సూచించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కబడ్డీ మన దేశ సాంప్రదాయ క్రీడల్లో ఒకటని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ క్రీడ ద్వారా వెలుగులోకి వస్తున్నారని అన్నారు. గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రమశిక్షణ, పట్టుదల, జట్టు సమన్వయంతో ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లో సంగారెడ్డి జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీలకు ముందు ప్రతి క్రీడాకారుడు తన సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉండాలని, జట్టు సభ్యుల మధ్య సమన్వయం పెంచుకోవాలని సూచించారు.

క్రీడలు కేవలం పోటీ కోసం మాత్రమే కాకుండా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి వారికి అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా కోచ్‌లు, నిర్వాహకులు, క్రీడాకారులు ఎమ్మెల్యేకు శిబిరం నిర్వహణ, శిక్షణా కార్యక్రమాల వివరాలను వివరించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు క్రీడాకారులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కబడ్డీ జాతీయ జట్టు మాజీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్ అంతి రెడ్డి, సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, వెంకటేష్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి గౌతమ్, జూనియర్స్ కోచ్ పండు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 15 ఏళ్ల ప్రస్థానం

5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…

6 hours ago

డీజెఎఫ్ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

6 hours ago

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…

9 hours ago

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…

9 hours ago

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…

9 hours ago

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

1 day ago