_క్రీడా ప్రాంగణాలతో ఆరోగ్య తెలంగాణ
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ఆరోగ్య తెలంగాణ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, పోచారం, ఘనాపూర్, నందిగామ, భానూర్, క్యాసారం, ఇస్నాపూర్ గ్రామాల్లో ఏర్పాటుచేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం రుద్రారం గ్రామంలో 8 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన పల్లె ప్రకృతి వనంను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ విద్యార్థులను, యువతను క్రీడలపై ఆసక్తి పెంపొందించడం తో పాటు, ప్రజలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా సంకల్పంతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాల కోసం భూములను సేకరించి, అన్ని వసతులు కల్పించామని తెలిపారు. అతి త్వరలో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ బన్సిలాల్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…