_స్టంట్ నుండి కళ్లద్దాల వరకు కేరాఫ్ గా సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్
_మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి
_పటాన్చెరులో ఘనంగా తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవాలు
_తరలివచ్చిన కార్మిక లోకం, పరిశ్రమల యాజమాన్యాలు
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిశ్రమల అనుమతుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఏకగవాక్ష విధానం మూలంగా అంతర్జాతీయ పరిశ్రమలకు రాష్ట్రం చిరునామాగా మారిందని మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లు అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి ఎంపీ కేపిఆర్, ఎమ్మెల్యే జిఎంఆర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ లు ముఖ్య అతిథులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమకారుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత తెలంగాణ ప్రజలకే దక్కిందన్నారు. పరిశ్రమలు పెట్టుబడి పెట్టాలంటే అనుమతులు, విద్యుత్తు, మానవ వనరులు, నీరు తదితర మౌలిక వసతులను కల్పించడంలో సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాల మూలంగా వేల సంఖ్యలో నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెనుముప్పుగా మారిందని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అంగట్లో సరుకుల వలె అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని పారిశ్రామిక రంగం తెలంగాణ వైపు చూస్తూ ఉందని ఆనందం వ్యక్తం చేశారు. 9 ఏళ్లకు ముందు 9 ఏళ్ల తర్వాత తెలంగాణ పారిశ్రామిక రంగ ప్రగతిని ప్రతి ఒక్కరు గమనించాలని విజ్ఞప్తి చేశారు.
పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆసియాలోని అతి పెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలో గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా కాలుష్యానికి చిరునామాగా ఉండేదని తెలిపారు. పరిశ్రమలు ఏర్పాటు అయితే ప్రజల బతుకులు మెరుగుపడతాయని ఆశిస్తే పటాన్చెరు నియోజకవర్గంలో కాలుష్యం కాటుకు వ్యవసాయం, ప్రజల ఆరోగ్యాలు తీవ్ర దుష్పరిణామాలకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం.. ముఖ్యమంత్రి కెసిఆర్ పారిశ్రామిక రంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంస్కరణ మూలంగా 90% కాలుష్యం తగ్గడంతో పాటు, కాలుష్య రహిత పరిశ్రమలైన మెడికల్ డివైస్, ఎల్ఈడి లైట్లు, సాఫ్ట్వేర్ రంగ పరిశ్రమలకు పటాన్చెరు కేంద్రంగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. గుండెలో వేసే స్టంట్ నుండి కళ్ళద్దాల వరకు సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కు కేంద్రంగా మారిందని తెలిపారు.
నూతన పరిశ్రమల ఏర్పాటుకు కేవలం 15 రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తూ ప్రవేశపెట్టిన టిఎస్ ఐపాస్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అంతర్జాతీయ పరిశ్రమల నుండి సూక్ష్మస్థాయి పరిశ్రమల వరకు పటాన్చెరును ఎంచుకోవడం సంతోషకరమన్నారు.పారిశ్రామిక రంగానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటున్నామని తెలిపారు.పరిశ్రమల ఏర్పాటుతో దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు పటాన్చెరు నియోజకవర్గంలో జీవనం కొనసాగిస్తున్నారని, వారందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.పరిశ్రమల అందించే సి ఎస్ ఆర్ నిధులతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతి పరిశ్రమ యాజమాన్యం, కార్మికులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్ల కాలంలో సంగారెడ్డి జిల్లాలో భారీ సంఖ్యలో నూతన పరిశ్రమలు ఏర్పాటయ్యాయని తెలిపారు. గతంలో పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తే.. సమస్యల చిట్టాలతో విజ్ఞాపన పత్రాలు ఇచ్చే వారిని తెలిపారు. నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో అవలంబిస్తున్న నూతన పారిశ్రామిక విధానం మూలంగా పరిశ్రమల యాజమాన్యాలు కొత్త పరిశ్రమల స్థాపనకు ఉత్సాహం చూపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి సంగారెడ్డి జిల్లాలో 4306 పరిశ్రమలో ఉండగా తొమ్మిదేళ్ల కాలంలో నూతనంగా 2572 పరిశ్రమలు ఏర్పాటు కావడంతో పాటు 1,88,191 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు.అనంతరం ఉత్తమ పారిశ్రామికవేత్తలు, కార్మికులు, చేనేత కార్మికులకు అవార్డులతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, దేవానందం, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, కుమార్ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు లలితా సోమిరెడ్డి, తుమ్మల పాండురంగారెడ్డి, రోజా బాల్ రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, జిల్లా పరిశ్రమల అధికారి ప్రశాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ అధికారులు, పరిశ్రమల సీఎండీలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…