Telangana

సీఎం కేసీఆర్ నాయకత్వంలో చెరువులకు జలకళ_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాగునీటి రంగంలో చేపడుతున్న సంస్కరణ మూలంగా మండు వేసవిలోనూ చెరువులు అలుగులను దూకుతున్నాయని, ప్రతి రైతు పుష్కలంగా పంటలు పండించుకుంటున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన బుధవారం పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పైన నిర్వహించిన సాగునీటి దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోలాటాలు, బతుకమ్మలతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సాగునీటి రంగంలో చేపట్టిన అభివృద్ధి నివేదికను అధికారులు వివరించారు.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రెడ్డి కాకతీయుల కాలంలో చెరువులను పునరుద్ధరించి పూడికలను తీస్తే తిరిగి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతర. ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులకు పునరుద్ జీవం తీసుకుని వచ్చారని తెలిపారు. దీని మూలంగా చెరువులు నిండుకుండలా మారి ఆయకట్టు విస్తీర్ణం పెరిగి అంచనాలకు మించి పంటలు పండిస్తున్నారని తెలిపారు.ఒకవైపు సాగునీరు.. మరోవైపు 24 గంటల విద్యుత్తు..మద్దతు ధర అందించడం మూలంగా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందారని ఆనందం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని చెరువులతోపాటు జిహెచ్ఎంసి, మున్సిపాలిటీల పరిధిలోని చెరువుల కట్టల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు అభివృద్ధికి ఇంకార్ సంస్థ సహకారంతో ఐదు కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసిలు సుప్రజా వెంకట్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, చెరువుల విభాగం సూపరిండెంట్ ఇంజనీర్ ఆనంద్, ఇరిగేషన్ డిఈ రామస్వామి, నళిని, ఆయా మండలాల ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago