అమీన్పూర్ లో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో అమీన్పూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 230 నూతన రేషన్ కార్డులు, 53 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కరోనా మూలంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కష్టాలను దూరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుదన్నారు. సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విమర్శలు చేయడనే పనిగా పెట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, తహశీల్దార్ విజయ్ కుమార్, ఎంపిటిసిలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, లబ్ధిదారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…