Hyderabad

గీతంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పటాన్‌చెరు:

ప్రప్రథమ భారత ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 133 వ జయంతిని పురస్కరించుకుని పటాన్‌చెరు సమీపంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ వహించి, వారి వ్యక్తిగత ఎదుగుదలకు సమ ప్రాధాన్యం ఇస్తే ఉపాధ్యాయుడే వారికి ఆదర్శం అని అన్నారు. తమలో పరివర్తన కలిగించిన అధ్యాపకులను ఏ విద్యార్థి అయినా జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు.

మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా అధ్యాపకులు కూడా మారుతూ కొత్త బోధనా పద్ధతులను అలవరచుకోవాలని, అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. అన్నింటికీ మించి నాణ్యమైన పరిశోధనలపై దృష్టి సారించి, గీతం లక్ష్యమైన ప్రపంచ మేటి వంద విశ్వవిద్యాలయాలలలో ఒకటిగా నిలవాలన్న ఆకాంక్షకు దోహదపడాలన్నారు.

ఈ కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజనీరింగ్ డెరైక్టర్ వినయ్ కుమార్ మిట్టల్, జీఎస్ హెచ్ఎస్ డెరైక్టర్ వీవీవీ నాగేంద్రకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్, ఆర్కిటెక్చర్, ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు, ప్రొఫెసర్ సునీల్ కుమార్, ప్రొఫెసర్ జీఎస్ కుమార్, జీహెచ్ బీఎస్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago