రామచంద్రపురం :
శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి కరోనా కాలంలో కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ తరపున ప్రజలకు అందించిన వివిధ సేవలను గుర్తించి ఆదివారం రోజు చిదంబరం నటరాజ కళా నిలయం రజతోత్సవ వేడుకలు తెలంగాణ సారస్వత పరిషత్ అబిడ్స్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రజలకు అందించిన వివిధ సామాజిక సేవలను గుర్తిస్తూ కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి కి కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి చేతుల మీదుగా ఈ అవార్డును అందుజేశారు.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తి అందిస్తుందని ఫౌండేషన్ పై మరింత బాధ్యత పెరిగిందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా గత 9 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ఆత్మవిశ్వాసంతో, బాధ్యతతో నిర్వర్తిస్తామని అన్నారు. సేవలో వుండే సంతృప్తి మానసిక పునరుత్తేజానికి నాంది పలుకుతాయని, ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు వుంటాయని తెలియచేశారు.చిదంబరం నాట్య గురువు ఫౌండర్ సెక్రెటరీ మంజుల కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…