శేరిలింగంపల్లి :
బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్రలో శేరిలింగంపల్లికి చెందిన కళాకారుడు హనుమంతుడి వేషధారణలో సందడి చేశారు. పీఏ నగర్‌లో నివాసం ఉండే గోపినాయకుడు వృత్తి రిత్యా డ్యాన్స్ మాస్టర్. అదేవిధంగా రవికుమార్ యాదవ్(ఆర్‌కేవై) టీం సభ్యుడిగా స్థానికంగా సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంటాడు. కాగా ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం వికారబాద్ జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో గోపినాయుడు హనుమంతుడి వేషదారణలో యాత్రికులను ఆకట్టుకున్నారు. రవికుమార్ యాదవ్ గోపిని బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్‌లకు పరిచయం చేశారు. హనుమంతుడి రాకతో ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి శ్రేణుల ఉత్సాహం రెట్టింపయ్యిందని బీజేపీ నాయకులు గోపి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాచమళ్ల నాగేశ్వర్ గౌడ్, ఆకుల లక్షణ్ ముదిరాజ్, కురుమ సూర్ణ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…