మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను ఆవిష్కరించిన తనిష్క్

Hyderabad Lifestyle Telangana

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

టాటా గ్రూప్‌కు చెందిన భారతదేశపు ప్రముఖ ఆభరణాల బ్రాండ్ తనిష్క్, దక్షిణ భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి ‘మల్లె’ అన్‌కట్ డైమండ్ కలెక్షన్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. వరమహాలక్ష్మి పండుగను పురస్కరించుకుని విడుదల చేసిన ఈ కలెక్షన్‌కు నటి రుక్మిణి వసంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.దక్షిణ భారత మహిళల జీవితంలో మల్లెపూలకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని ప్రతిబింబించేలా ఈ కలెక్షన్‌ను రూపొందించినట్లు సంస్థ తెలిపింది. మల్లెపూల మొగ్గలు, వికసించిన పువ్వులు, పూలదండల ఆకృతులను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ ఆభరణాల్లో 18 క్యారెట్ల బంగారం, అన్‌కట్ వజ్రాలు, పచ్చలు, కెంపులు, నీలమణులు, ముత్యాలను వినియోగించారు. హారాలు, చోకర్లు, ఝుంకీలు, గాజులు, బ్రాస్‌లెట్లు, ఉంగరాలు, పెండెంట్లు వంటి అనేక రకాల ఆభరణాలు ఈ కలెక్షన్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఈ సందర్భంగా తనిష్క్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పెల్కి షెరింగ్ మాట్లాడుతూ, “దక్షిణ భారత మహిళలకు మల్లెపూలతో ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఆ భావోద్వేగాన్ని ఆధునిక అన్‌కట్ డైమండ్ ఆభరణాల రూపంలో ఆవిష్కరించడమే ‘మల్లె’ కలెక్షన్ లక్ష్యం. ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లను అందించడంలో తనిష్క్ ఎల్లప్పుడూ ముందుంటుంది,” అని తెలిపారు.నటి రుక్మిణి వసంత్ మాట్లాడుతూ మల్లెపువ్వు మన సంస్కృతి, ఇంటి ఆప్యాయత, పండుగల ఆనందానికి ప్రతీక. ఈ కలెక్షన్ సంప్రదాయాన్ని కాపాడుతూ ఆధునిక శైలిలో అందంగా ఆవిష్కరించింది. మన వారసత్వాన్ని నేటి తరానికి మరింత చేరువ చేసే ప్రయత్నం ఇది అని పేర్కొన్నారు.వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా ఆగస్టు 19 నుంచి 22 వరకు బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.601 వరకు తగ్గింపు, మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ విలువపై 20 శాతం వరకు రాయితీ అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తనిష్క్ స్టోర్లలో ఆగస్టు 31 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *