వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి…
– ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
నియోజక వర్గంలో సూపర్ స్ప్రేడర్ల కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో సూపర్ స్ప్రేడర్ల కు ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించి, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్ర, శని వారాలలో వ్యాక్సినేషన్ టీకా వేయుటకు, సమాచార పౌర సంబంధాల శాఖ పరిధిలోని జర్నలిస్టులకు, వ్యవసాయ శాఖ పరిధిలోని ఎరువులు, పెస్టిసైడ్స్,విత్తనాలు డీలర్లు హమాలీలు పౌర సరఫరాల శాఖ పరిధిలోని చౌక ధరల దుకాణాల డీలర్లు, గుమస్తాలు వర్కర్లకు,ఎల్పిజి గ్యాస్ పంపిణీ వర్కర్లకు పెట్రోల్ బంకుల్లో పనిచేసే వర్కర్లకు వ్యాక్సినేషన్ టీకాలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటూ సేవలందించే వారిని ప్రభుత్వం సూపర్ స్ప్రేడర్ల లుగ గుర్తించి, వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. సంబంధిత అధికారులు గుర్తించిన సూపర్ స్ప్రేడర్లలందరూ తమకు కేటాయించిన వాక్సినేషన్ కేంద్రాలలో టీకా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వ్యాక్సినేషన్ కేంద్రాలలో భౌతిక దూరం పాటించాలని, తప్పకుండా మాస్కులు ధరించాలని, వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
రామచంద్రాపురం లో..
రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని కానుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ కేంద్రాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సూపర్ స్ప్రేడర్స్ గా గుర్తించిన వాటితోపాటు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతీ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, ఎమ్మార్వో శివ కుమార్, ఎస్సై కోటేశ్వర రావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…