డీఎస్పీ భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు
పటాన్చెరు
మెదక్ స్థానిక సంస్థల శాసన మండలి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పటాన్చెరు పట్టణానికి చెందిన గుండు ప్రవీణ్ కుమార్ తమ అనుమతి లేకుండా తన నామినేషన్ పత్రంలో తాము తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నారని పేర్కొంటూ తమ సంతకాలను ఫోర్జరీ చేశారని, అతని పై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ పటాన్చెరువు డిఎస్పి బీమ్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తెలిపారు.
సోమవారం పటాన్చెరు డిఎస్పి భీమ్ రెడ్డి కి ఫిర్యాదు చేసిన అనంతరం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి స్వతంత్ర అభ్యర్థిగా ఇటీవల నామినేషన్ దాఖలు చేసిన ప్రవీణ్ కుమార్ తన నామినేషన్ పత్రం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్, ముత్తంగి ఎంపీటీసీ గడిల కుమార్ గౌడ్ లు తన నామినేషన్ ను బలపరుస్తున్నారనీ ఫోర్జరీ సంతకాలు చేయడం జరిగిందని తెలిపారు.
తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం తమ పరువుకు నష్టం కలిగించేలా వ్యవహరించిన ప్రవీణ్ కుమార్ పై న్యాయ పరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…