మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్:
ప్రీమియం డిజైనర్ ఆభరణాల బ్రాండ్ సువర్ణం జ్యువెల్స్ హైదరాబాద్‌లో రెండో షోరూమ్‌ను బంజారాహిల్స్ రోడ్ నెం.10లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మోడల్స్ ఆభరణాలు ధరించి ప్రదర్శన చేశారు. మోడల్స్ ధరించిన బంగారపు డిజైన్లు సువర్ణం జ్యువెల్స్ వారి ప్రత్యేకగా తెలిపారు.సంప్రదాయ నైపుణ్యానికి ఆధునిక డిజైన్లను జోడిస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఆభరణాలను అందించాలనే లక్ష్యంతో సువర్ణం సంస్థ ముందుకు సాగుతోంది.సువర్ణం జ్యువెల్స్‌లో బంగారం, వజ్రాలు, పోల్కీ, కుందన్ ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం రూపొందించిన హారాలు, చోకర్లు, వడ్డాణాలు, గాజులు, చెవిపోగులు, ఉంగరాలు తదితర హ్యాండ్‌క్రాఫ్ట్ జ్యువెలరీకి వినియోగదారుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
సంస్థ వ్యవస్థాపకుడు సిద్ధాంత్ నహార్ లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి వెల్త్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తి చేశారు. భారతీయ సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ఆధునిక అభిరుచులతో మేళవిస్తూ సువర్ణం జ్యువెల్స్‌ను విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్‌గా తీర్చిదిద్దారు.ఈ సందర్భంగా సిద్ధాంత్ నహార్ మాట్లాడుతూ, “రెండో స్టోర్ ప్రారంభం కేవలం వ్యాపార విస్తరణ మాత్రమే కాదు. మా వినియోగదారులు, భాగస్వాములు మాపై ఉంచిన విశ్వాసానికి ఇది నిదర్శనం. వారి ఆదరణతోనే ఈ స్థాయికి చేరుకున్నాం. సంప్రదాయం, అందం, నాణ్యత కలగలిసిన ఆభరణాలను అందించేందుకు మరింత కృషి చేస్తాం” అని తెలిపారు.
కొత్త షోరూమ్‌లో ప్రత్యేక వధూవరుల కలెక్షన్లు, పండుగల కోసం రూపొందించిన ఆభరణాలు, వారసత్వ శైలిలో రూపొందించిన డిజైన్లు, కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా ప్రత్యేక ఆర్డర్ జ్యువెలరీ సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.ఈ సందర్భంగా సంస్థ అభివృద్ధికి తోడ్పడిన వినియోగదారులు, కళాకారులు, సరఫరాదారులు, వ్యాపార భాగస్వాములు, శ్రేయోభిలాషులకు సువర్ణం జ్యువెల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
