ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో ప్రత్యేక యోగా

politics Telangana

మనవార్తలు ప్రతినిధి , రామచంద్రపురం :

యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుందని భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి అన్నారు భారతీనగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎమ్ ఐ జి కాలనీ శ్రీ వాణి విద్యానికేతన్ స్కూల్ సమీపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో భారతీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యాయి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగకరమని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగాతో శరీరం, మనస్సు, ఆత్మకు సమతుల్యత లభిస్తుంది” అని పేర్కొంటూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించారు. అన్ని వయసుల వారు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు, శ్వాస వ్యాయామాలు చేశారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ఫ్యూజన్ ఫిట్‌నెస్ స్టూడియో నిర్వాహకులను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ముదిరాజ్ , మణి, తిలావత్, రాకేష్ రెడ్డి, పవన్ పాల్గొనారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *