పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈఈసీఈ) ‘5జీ టెక్నాలజీ, ఆపైనె పురోగతి’ అనే అంశంపై రెండు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమాన్ని (ఎఫ్ డీపీ ) ఇటీవల నిర్వహించినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధునాతన కమ్యూనికేషన్ టెక్నాలజీలో 5జీ టెక్నాలజీ, పరిశోధనా రంగాలలో తాజా పరిణామాలను సదస్యులకు పరిచయం చేయడం లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఐఈఐ తెలంగాణ విభాగం పూర్వ అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5జీ టెక్నాలజీలో అభివృద్ధిని అందిపుచ్చుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో పరిశ్రమ నిపుణులు 5జీ టెక్నాలజీకి సంబంధించిన వివిధ అంశాలపై లోతెన అవగాహన కల్పించారు. 5జీ కమ్యూనికేషన్స్ ప్రాథమిక అంశాలపై తేజోసెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రమణ రావూరి; 5జీ అభివృద్ధి విధానాలు, భవిష్యత్తు నెట్ వర్క్ లపై సిగ్వర్క్స్ రీసెర్చ్ ల్యాబ్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సుభ్ర ప్రకాష్: బ్రాడ్బ్యాండ్ కమ్యూనికేషన్లలో లేజర్ మూలాల పాత్రపై రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ మార్తా ఎన్.రెడ్డి తదితరులు ప్రసంగించారు. 5జీ నెట్ వర్క్ లలో భద్రత, గోప్యత సవాళ్ల గురించి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ చెందిన డాక్టర్ ప్రఫుల్ మాస్కర్ వివరించారు.ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ మాధవి స్వాగతోపన్యాసం చేయగా, కార్యక్రమ సమన్వయకర్త ఎం.రఘుపతి వందన సమర్పణ చేశారు. ఎఫ్ఎసీ ప్రారంభోత్సవంలో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేటెడ్ డైరెక్టర్ క్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, పరిశ్రమ నిపుణులు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…