Telangana

రేపు జ్యోతి విద్యాలయలో స్టూడెంట్ ఫెస్ట్

– హాజరుకానున్న పలువురు ప్రముఖులు

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

జీవితం లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటేచదువుతో పాటు అన్నిరకాల విద్యలు కూడా ముఖ్యమేననే సిద్ధాంతాన్ని నమ్మి గత 49 సంవత్సరాలనుండి వివిధ రంగాల్లో విద్యార్థులు రాణించేలా నైపుణ్యం సాధించడానికి, వారిలో సృజనాత్మకత పెంపోందించడానికి బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ కృషి చేస్తుందని స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ తెలిపారు.ఈ నెల 16 అంటే రేపు స్కూల్ ప్రాంగణం లో స్టండెంట్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్యతిధులుగా రానున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి క్లాస్ లో ప్రతీ సెక్షన్, టాపర్ కు మొదటి, రెండో బౌమతులు, మెమంటోలు ఇస్తామని, డుమ్మాలు కొట్టకుండా నిబ్బద్దతో పని చేసే టీచర్లను, ఆయాలను సత్కరిస్థామన్నారు. విచ్చేసే అధిధులకు స్కూల్ కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్ స్వాగతం పలుకుతారు. టీచర్లు స్కూల్ యాన్వల్ రిపోర్ట్ చదివి విన్పిస్తారు. చదువే కాకుండా స్కూల్ లో అన్ని రకాల సౌకర్యాలతో పాటు, స్మార్ట్ బోర్డులు, విద్యార్థుల రక్షణ కోసం సిసి కెమెరాలు ఏర్పాట్లు చేశామని, విశాలమైన గ్రోండ్ లో పిల్లలకు అన్నిరకాల క్రీడల్లో శిక్షణనిచ్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ స్టూడెంట్ ఫెస్ట్ లో విద్యార్థుల చేత కూపన్లు విక్రహించి ఫుడ్, అండ్ గేమ్స్ స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన డబ్బుల్లో కొంతబాగాన్ని అనాధ శరణాలయాలకు అందజేయనున్నారు. వివిధ బాస్కెట్ బాల్, వాలీబాల్, త్రో బాల్స్, స్కెటింగ్ వంటి పోటిల్లో రా ణించిన వారికీ బౌహుమతులు అందజేస్తారు. డ్యాన్సింగ్, సింగింగ్ వంటి సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వరల్డ్ సేఫ్టీ డే అండ్ హెల్త్ ఎట్ వర్క్ సందర్బంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటేషన్ నేషనల్ లెవల్ లో పాల్గొన్న టీచర్లు చిత్ర లేఖ కు మొదటి బౌమతి రాగా, థర్డ్ ప్రైజ్ యోగితా సాధించి తమ స్కూల్ పేరు నిలబెట్టారు.కూపన్లు లక్కీ డ్రా తీసి అందులో వచ్చిన వారికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ లు అందజేస్తారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago