తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు దిశగా అడుగులు ..
-మంచి ఫలితాలు ఇస్తున్న లాక్ డౌన్
-తెలంగాణలో రేపటితో ముగుస్తున్న లాక్ డౌన్
-రేపు కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం
హైదరాబాద్:
లాక్ డౌన్ వల్ల మంచి ఫలితాలు ఉండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మరో 10 నుంచి పదిహేను రోజులు పొడిగించే అవకాశముంది . ఇప్పటికే రెండు దఫాలుగా పొడిగిస్తూ వస్తున్నా ప్రభుత్వం ప్రజలనుంచి , ఫీడ్ బ్యాక్ తీసుకుంది. కఠినంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపులు ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే ముఖ్యమంత్రి ,రేపు జరగబోయో మంత్రి వర్గ సమావేశంలో దీనిపై మంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు పంపిన మార్గదర్శనాలలో జూన్ నెలాఖరువరకు లాక్ డౌన్ పొదిగితే బాగుంటుందనే సూచన చేశాయి.
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన ఈసారి కొంత కఠినంగానే లాక్ డౌన్ అమలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. రేపటితో రాష్ట్రంలో లాక్ డౌన్ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సందర్భంగా లాక్ డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం… లాక్ డౌన్ ను మరి కొన్ని రోజుల పాటు కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఘననీయంగా తగ్గింది.ప్రజల్లో కొంత మేరకు అవగాహనా కలిగింది. అయితే వ్యాక్సిన్ అనుకున్నంత వేగంగా జరగటంలేదు. వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వ యంత్రంగాం సిద్ధంగా ఉన్న వ్యాక్సిన్ సరఫరా అందుకు అనుగుణంగా లేదు . చివరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొనిగొలు చేసేందుకు సిద్ధపడిన ఫార్మా కంపెనీ లు సరఫరా చేయలేక పోతున్నాయి. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మల్ల గుల్లాలు పడుతున్నాయి. అందువల్ల రేపటి కేబినెట్ సమావేశంలో… ప్రస్తుత లాక్ డౌన్ ఎలాంటి ఫలితాలను ఇచ్చిందనే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉంది? అనే విషయంపై ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కేసీఆర్ ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగిస్తేనే మేలనే అభిప్రాయాన్ని వీరిలో ఎక్కువ మంది వెల్లడించినట్టు సమాచారం. మరోవైపు రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…