మనవార్తలు ,రామచంద్రాపురం
పటాన్చెరు నియోజకవర్గం భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా లో జరుగుతున్న ఇంటింటి ఫీవర్ సర్వేను ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 100% ఫీవర్ సర్వే పూర్తవుతుందని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి హోం ఇసోలేషన్ కిట్లు అందించడంతోపాటు, పరిస్థితి తీవ్రతను బట్టి ఆసుపత్రికి తరలించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే తీరును వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…