మనవార్తలు ,పటాన్ చెరు:
దివ్యాంగుల పట్ల సమాజం చిన్నచూపు చూడొద్దని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగిలోని పీఎస్ఆర్ గార్డెన్స్ లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విధి రాత తో దివ్యాంగులు అయిన వారికి తమ వంతు కర్తవ్యంగా సహాయ సహకారాలు అందించాలన్నారు.
సరైన పద్ధతిలో వారికి శిక్షణ ఇచ్చి సమాజంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు .అనంతరం నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన సుమారు 50 మంది వికలాంగులకు నిత్యావసర సరుకుల, ఐదుగురికి కుట్టు మిషన్లు , కొండకింద బాధితులకు పోషక ఆహారము, మందులను గడీల శ్రీకాంత్ గౌడ్ అందజేశారు.దీంతో పాటు దివ్వంగులకు సేవ చేస్తున్న తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు, సామాజిక కార్యకర్తలను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నరేందదర్ రెడ్డి, బీజేపీ యస్.సి మోర్చ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్,మంజీరా స్కుల్ హెడ్ మాస్టర్ జగన్ మోహన్, ముత్తంగి ఉప సర్పంచ్ లింగారెడ్డి, మహేష్, సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, మెరాజ్ ఖాన్, దుబాయ్ అశోక్, రవి, ధన్ రాజ్, సాయి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…