_హైదరాబాద్ పార్క్ హయత్ లో ఫొటో ఆల్బమ్ తన పేరుతో ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమత్రతో కలిసి ఆవిష్కరిస్తున్న సితార ఘట్టమనేని
మనవార్తలు ,హైదరాబాద్:
వాణిజ్య ప్రకటనలో నటించడంతో వచ్చిన తన తొలి పారితోషికాన్ని ఛారిటీ కోసం ఖర్చు చేశానని సూపర్ స్టార్ మహేష్‌బాబు, నమ్రతల కూతురు సితార ఘట్టమనేని అన్నారు. శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్‌లో తాను నటించిన పీఎంజే జ్యువెల్స్ యాడ్ ఆవిష్కరించడంతో పాటు తన పేరు మీద ముద్రించిన లుక్‌బుక్‌ను అమ్మ నమ్రతా ఘట్టమేననితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. తనకు సినిమా అంటే ఇష్టమని సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని అన్నారు. తన అమ్మ నుంచి ఎంతో కాన్ఫిడెన్స్ నేర్చుకున్నానని, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మసలుకోవాలో తెలుసుకున్నానని తెలిపారు. తాను నటించిన తొలి యాడ్ పీఎంజే జ్యువెల్స్ చిత్రాలు, వీడియోలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన న్యూయార్క్ టైమ్ స్వేర్‌పై రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ దృశ్యాలను తన తండ్రి మహేష్‌బాబు ఎన్నోసార్లు చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారని చెప్పుకొచ్చారు.
మహేష్‌బాబు తనయుడు గౌతమ్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తారని నమ్రతను ప్రశ్నించగా గౌతమ్ ప్రస్తుతం తన చదువుపై ఆసక్తిగా ఉన్నాడని ఆరేడు సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి వస్తాడని తెలిపింది. ఈ షార్ట్ ఫిలిం 2023 జూలై 19వ తేదీన అధికారికంగా రిలీజ్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎంజీ జ్యువెల్స్ ప్రిన్సిపుల్ డైరెక్టర్, డిజైనర్ దినేశ్ జైన్, డైరెక్టర్ రక్షిత జైన్, నిమేష్, సీమ, శౌర్య, తదితరులు పాల్గొన్నారు. అద్బుతమైన డిజైన్స్PMJ జ్యువెల్స్ అద్బుతమైన డిజైన్స్ తో స్టార్ సితార కలెక్షన్స్ ను రూపొందించినట్లు నిర్వహకులు తెలిపారు . మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సితార ఘట్టమనేని, నమ్రత ఘట్టమనేని సమాదానాలు ఇచ్చారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…