సిద్ధార్థ నగర్ కాలని సంక్షేమ సంఘం ఎన్నికలు

politics Telangana

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు

గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి

అధ్యక్షులుగా ఉపేందర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు సర్కిల్ ముత్తంగి డివిజన్ కార్దనూర్ లోని సిద్ధార్థ నగర్ కాలనీలో ఆదివారం అధ్యక్షులు మనోహర్ అధ్యక్షత జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కాలనీ సంక్షేమ సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. కాలనీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా కాలనీ గౌరవాధ్యక్షులు పాండురంగారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రెటరీ ఎస్ ఉపేందర్ 2022వ సంవత్సరం నుండి 2026 జూన్ వరకు జరిగిన కాలని కార్య కలాపాలు జనరల్ బాడీ సమావేశంలో వివరించడం జరిగింది. జమ ఖర్చుల వివరాలను సభ్యులకు వివరించిన అనంతరం సమావేశంలో కార్యకలాపాల జమా ఖర్చుల వివరాలకు ఆమోదం తెలుపటం జరిగింది.

జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలు
కాలనీలో వాచ్ మెన్ రూము నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు చేయటం వంటి తీర్మానాలు చేపట్టారు.

కాలని సంక్షేమ సంఘం ఏకగ్రీవ ఎన్నిక

గౌరవ సలహాదారుగా చుక్కా రాములు,గౌరవ అధ్యక్షులుగా పాండు రంగా రెడ్డి,సలహాదారుగా శ్రీనివాస్,కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఎస్ ఉపేందర్,ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా బాల్ రెడ్డి,కోశాధికారిగా మణికంఠన్,సంయుక్త కార్యదర్శులుగా సయ్యద్ కరిం, శ్రీహరి రెడ్డి,కమిటీ సభ్యులుగా ఆర్ నరేందర్ రెడ్డి,ఎస్ మహేష్, బి మల్లయ్య, ఎం బాలకృష్ణ, విసి సంతోష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకున్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ సిద్ధార్థ కాలనీ సంక్షేమం కోసం అందరి సహాయ సహకారాలతో కాలనీ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *