Hyderabad

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు…

కేసీఆర్ పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్:

  • కాంట్రాక్టు పద్ధతిపై వైద్య సిబ్బందిని నియమించాలనుకుంటున్నారు
  • అర్హత సాధించిన 658 మంది నర్సులకు ఇంకా ఉద్యోగాలు కల్పించలేదు
  • వారిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలి
  • తెలంగాణ ముఖ్యమంత్రిపై వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సారుకు కాంట్రాక్టు ఉద్యోగాలే ముద్దుగా ఉన్నాయని విమర్శించారు. సీఎం పదవిని కూడా కాంట్రాక్టు కింద పెట్టుకుంటే పోలే అని ఎద్దేవా చేశారు. కరోనా విజృంభిస్తున్న వేళ కాంట్రాక్టుపై వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించుకుందని అన్నారు.

2017లో 3,311 స్టాఫ్ నర్సులకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు… అర్హత సాధించిన ఇంకా 658 మందికి మాత్రం ఉద్యోగాలు కల్పించలేదని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు కాంట్రాక్టు పద్ధతిన నర్సింగ్ సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్న ప్రభుత్వం… ముందు అర్హత సాధించిన 658 మందిని పర్మినెంట్ గా ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి తోడు ‘తాత్కాలిక పోస్టులకే పిలుపు’ అంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని ఆమె షేర్ చేశారు.

Venu

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago