మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :
తెలంగాణా చేనేతకారులకు పొదుపు, భీమాతో పాటు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ ను చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామని తెలంగాణా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ అన్నారు. సోమవారం శ్రీనగరాకాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటుచేసిన సిల్క్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. సిల్క్ ఎగ్జిబిషన్లో చేనేతకళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీలో నాణ్యమైన పట్టు, కాటన్ వస్త్రాలు లభిస్తాయని, దేశంలోని అన్నిప్రాంతాల చేనేతకారులకు ఒకచోట చేర్చి వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందింస్తున్న నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్ కుమార్ లను ప్రశంశించారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో చేనేతకారుల ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని, దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన చేనేత కళాకారులు వారి ఉత్పత్తులను సుమారు. 80స్టాల్స్ ఏర్పాటుచేశామని సిల్క్ ఇండియా సీఈఓ వినయ్ కుమర్ తెలిపారు. రానున్న క్రిస్మస్, సంక్రాంతి, పలు శుభకార్యాలకు అనువుగా పోచంపల్లి, మదనపల్లి, గద్వాల, వెంకటగిరి, చెందేరి, ఇక్కత్, నారాయణ్ పేట్, బెనారస్, కొలకతాతో పాటు పలు నగరాలకు చెందిన విభిన్నమైన. అరుదైన చీరలను స్టాల్స్ ఏర్పాటుచేశామని, ఈనెల 15వరకూ ఈ ఎగ్జిబిషన్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వీవర్స్ సర్వీ స్ సెంటర్ హెడ్, డైరెక్టర్ డాక్టర్ అరుణ్ కుమార్, హ్యాపీ శ్రీదేవి, వై. శైలజా పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…