Telangana

చిట్కుల్లో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

సోనియా వల్లే తెలంగాణ

దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్న దేవత

నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకొని తమ పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు స్వరాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీ కే దక్కుతుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ 78వ జన్మదిన పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంపు కార్యాలయంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని రాజకీయ ప్రకంపనలు వచ్చినా అన్నింటినీ తట్టుకుని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారుల దశాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చిన దేవత సోనియాగాంధీ అని కొనియాడారు. తల్లి సోనియమ్మ కృషితోనే అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనను సుసాధ్యం అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసిన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. సోనియా మీద అభిమానంతోనే, ఆమె త్యాగాలను గుర్తించి, తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని ఇచ్చారన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం కట్టబెట్టారన్నారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ఇందిరమ్మను గుర్తుచేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని వివరించారు.గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డ అన్ని వర్గాలను గుర్తించి సమ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనది పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎస్ఐఆర్‌లో పాల్గొనండి.. పటాన్‌చెరు అభివృద్ధిలో భాగస్వాములు కండి ఎస్ఐఆర్ అవగాహన కోసం 30 ప్రచార రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.…

6 hours ago

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కురి నరసింహారెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: బీజేపీ మోడి ప్రభుత్వంలో 153 సార్లు పరీక్షా పత్రాల లీకుల వల్ల 7 కోట్ల మంది విద్యార్ధుల…

19 hours ago

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాటి చార్జ్ అమానుషం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జి జయరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా…

19 hours ago

పరిశ్రమల్లో ఉత్పత్తులు జరగాలంటే కార్మికుల శ్రమశక్తి తోనే సాధ్యం_ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు

బిస్లరీ యాజమాన్యం చట్టవిరుద్ధంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి బిస్లరీ యాజమాన్యం మొండివైఖరి వీడాలి..లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తం పోరాటం…

19 hours ago

ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్రం కుట్ర నీలం మధు ముదిరాజ్

రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోంది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో బీజేపీ చెలగాటం నీట్ పేపర్ లీక్‌కు…

19 hours ago

జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి

మనవార్తలు ప్రతినిధి, ​సంగారెడ్డి: జిన్నారం సర్వే నెం. 1 బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి…

2 days ago