పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు నియోజకవర్గంలో రహదారులను విస్తరించడంతోపాటు, మరమ్మత్తు పనులకు నిధులు కేటాయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మంత్రి నివాసంలో కలిసి, వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు రోడ్ల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలు ఉండటంతో పాటు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. దీంతో వివిధ కాలనీల ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు నిత్యం ప్రమాదాలబారిన పడుతున్నారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధానంగా
పటాన్ చెరు నుంచి శంకర్ పల్లి వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని.. ఇందుకోసం 84 కోట్ల రూపాయలు కేటాయించాలని,పటాన్చెరు నుండి ఇంద్రేశం, పెద్ద కంజర్ల మీదుగా బేగంపేట వరకు రహదారి విస్తరణకు 56 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు.ఎమ్మెల్యే అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అతి త్వరలో రహదారుల అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులు, విస్తరణ విషయంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతుందని మంత్రి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…