పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని పరిశోధకురాలు డాక్టర్ కళ్యాణి పెడ్డికొండలను మహిళా శాస్త్రవేత్తగా భారతీయ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టి) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆమె పరిశోధనల : మార్గదర్శి (రీసెర్చ్ గెడ్), రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు. క్యాన్సర్ వ్యాధుల చికిత్స కోసం శక్తివంతమైన నిరోధకాలను గుర్తించి, ఆ ప్రతిపాదనలను డీఎస్ఎకి ఆమె సమర్పించారన్నారు. పరిశోధనలో సమకూరిన విజయాలు, సామాజిక ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నందుకు గాను ఆమెను మహిళా శాస్త్రవేత్తగా డీఎసిటీ ఎంపిక చేసినట్టు తెలిపారు.
డాక్టర్ కళ్యాణి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో ఎమ్మెస్సీని, హెదరాబాద్ జేఎన్టీయూ నుంచి పీహెచ్ డీ పట్టాను పొందారని, ఇప్పటివరకు దాదాపు 40కి పైగా పరిశోధనా పత్రాలు వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమైనట్టు రాంబాబు పేర్కొన్నారు. గతేడాది కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన జాతీయ సదస్సులో డాక్టర్ కళ్యాణి సమర్పించిన పరిశోధనా పత్రం అత్యుత్తమైనదిగా ఎంపికైందన్నారు. క్యాన్సర్ చికిత్సలో రసాయనాల ప్రభావంపై డాక్టర్ కళ్యాణి ఐదు పుస్తకాలను ప్రచురించినట్టు తెలిపారు. రాబోయే తరాలకు క్యాన్సర్ వ్యాధి బారి నుంచి రక్షించే ఔషధాల రూపకల్పనే ధ్యేయంగా ఆమె పరిశోధనలను కొనసాగిస్తున్నట్టు డాక్టర్ రాంబాబు వివరించారు.
మహిళా శాస్త్రవేత్తగా ఎంపికెన డాక్టర్ కళ్యాణిని గీతం రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, మరో పరిశోధనా మార్గదర్శి ప్రొఫెసర్ కె.ఎం. ప్రకాష్ తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.…
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం…
పటాన్‌చెరు నియోజకవర్గ చరిత్రలోనే మొట్టమొదటిసారి..438 మంది 10వ తరగతి ప్రతిభావంతులకు సైకిళ్ల పంపిణీ. 35 లక్షల రూపాయల సొంత నిధులతో…
రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన…
మనవార్తలు ప్రతినిధి , రామచంద్రాపురం: పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పటాన్‌చెరు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని…