సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి,శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్
బిస్లరీ కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం
తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలి
సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికులకు రూ. 10వేలు శాండ్విక్ యూనియన్ సంఘీభావ నిధి
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
బిస్లరీ యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి హిష్టారీతిగ వ్యవహరిస్తుందని, కార్మికులకు అండగా జిల్లా కార్మిక వర్గం ఉంటుందని తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి శాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ మనోహర్ యజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో బిస్లరీ ఇంటర్నేషనల్ పరిశ్రమ వద్ద గత పది రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు సాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పదివేల రూపాయలు సంఘీభావ నిధిని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు బిస్లరి యాజమాన్యానికి కార్మికుల అంటే బానిసలుగా చూస్తుందన్నారు. యాజమాన్యం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. బిస్లరీ కార్మికులకు జిల్లా కార్మిక వర్గం అండగా ఉంటుందన్నారు. బిస్లరి కార్మికుల పోరాటానికి మద్దతుగా జిల్లా వ్యాప్త పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా తొలగించిన బిస్లరీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని యూనియన్ గుర్తించాలని వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు.. కార్మికుల ఐక్యంగా పోరాడి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్, శాండ్విక్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ సత్తిబాబు, వెంకట్రావు, వీరారావు, సదాశివరెడ్డి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రాజు, బిస్లరీ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి నాయకులు నాగరాజు, ప్రవీణ్ గౌడ్, సతీష్, కృష్ణ కుమార్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…