Telangana

మరోసారి ఉదారతను చాటిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు

రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా పుట్టిన పిల్లలకు 20వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్

ముత్తంగిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

తెల్లాపూర్ జిహెచ్ఎంసీ సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అగ్రనేత లోకసభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ముత్తంగి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా, సేవా కార్యక్రమాలతో మిన్నంటాయి. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. కేవలం కేక్ కటింగ్స్, హంగామా వంటి ఆడంబరాలకు పోకుండా, సమాజంలోని అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు అండగా నిలిచేలా పలు వినూత్న సేవా కార్యక్రమాలను చేపట్టడం ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని నీలం మధు ముదిరాజ్ తన అపారమైన ఉదారతను చాటుకుంటూ పసికందుల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ రోజు జన్మించిన పసికందులకు వారి భవిష్యత్తు భద్రత కొరకు ప్రతి సంవత్సరం లాగే ఈ సారికూడా తలా 20 వేల రూపాయల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చెక్కు లను అందజేయనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ప్రసవాలు చేసుకునే నిరుపేద కుటుంబాలకు ఈ సాయం కొండంత అండగా నిలిచింది.

అదేవిధంగా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అహర్నిశలు శ్రమిస్తున్న జీహెచ్ఎంసీ సఫాయి కార్మికులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం వారి కుటుంబాలకు అవసరమైన నిత్యవసర వస్తువుల కిట్లను నీలం మధు ముదిరాజ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమాజ సేవలో భాగస్వాములవుతున్న కార్మికులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో ద్వేషాన్ని తొలగించి, ప్రేమాభిమానాలను నింపడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ గారు ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టారని, ఆయన ఆశయాలు, త్యాగాలు దేశ యువతకు ఎంతో ఆదర్శమని కొనియాడారు. దేశ రక్షణే ధ్యేయంగా, పేదల గొంతుకగా ఆయన నిరంతరం పోరాడుతున్నారని  తెలిపారు.

రాహుల్ గాంధీ పుట్టినరోజున పేద ప్రజలకు, కార్మికులకు సేవ చేయడం ద్వారా ఆయనకు నిజమైన జన్మదిన కానుక ఇస్తున్నామని, పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన పసికందుల భవిష్యత్తుకు చిన్న సాయం అందించడం, అలాగే ఎండనక వాననక కష్టపడే మన జీహెచ్ఎంసీ కార్మికులను ఆదుకోవడం తమకు దక్కిన అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజల పక్షాన నిలబడి మరిన్ని ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నీలం మధు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, సంగన్నగారి గోపాల్, నరసింహ రెడ్డి, వెంకటేష్ నాయక్, రాఘవేంద్ర, నారాయణదాసు, సంపత్ రెడ్డి, మణికంఠ, సందీప్ గౌడ్, జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు కోల్కూరి నరసింహారెడ్డి, అశోక్ ముదిరాజ్, మధు పంతులు, గడ్డ యాదయ్య, గుండ్ల మహేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి,గోపాలకృష్ణ, సందీప్ యాదవ్, దశరథ్,ప్రవీణ్, విఠల్, రంజిత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొనారు..

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago