Telangana

గీతంలో అజ్ఞాత వీరులకు సన్మానం

ఆనందోత్సాహాల మధ్య ఉత్సాహంగా ముగిసిన ముదిత 4.0 వేడుక

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

సురక్షితమైన, ఆహ్వానించదగిన, సుసంపన్నమైన ప్రాంగణ వాతావరణాన్ని సృష్టించడంలో అంకితభావంతో కీలక పాత్ర పోషించే ఆతిథ్య విభాగం, క్యాంపస్ లైఫ్, సహాయక సేవల బృందాలను గౌరవిస్తూ, హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తన వార్షిక ఉద్యోగుల గుర్తింపు, అభినందన కార్యక్రమం ముదిత 4.0ను శుక్రవారం ఘనంగా నిర్వహించింది.ఇతరుల సంతోషం, విజయాలను చూసి ఆనందించడం అని అర్థం వచ్చే సంస్కృత పదం ‘ముదిత’ నుంచి ఉద్భవించిన ఈ కార్యక్రమం కృతజ్జత, సేవ, జట్టు కృషి, సామూహిక విజయం వంటి విలువలను ప్రతిబింబిస్తుంది. విశ్వవిద్యాలయ కమ్యూనిటీకి మద్దతుగా తెర వెనుక అవిశ్రాంతంగా పనిచేసే ఉద్యోగుల అమూల్యమైన సహకారాన్ని గుర్తించే ఒక ఆదరణీయమైన సంప్రదాయంగా ముదిత గత మూడేళ్లగా రూపుదిద్దుకుంది.

ఆతిథ్య విభాగం, క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశుధ్య, వంటలు, నిర్వహణ, సాంకేతిక విభాగం, తోటపని, పరిసరాలను ఆహ్లాదంగా తీర్చిదిద్దేవారు, హాస్టల్ సిబ్బంది, రవాణా, ప్రాజెక్టులు, ఐటీ, ధ్వని-దృశ్యం (ఆడియో-విజువల్) విభాగం, మానవ వనరులు, ఆర్థిక, పరిపాలనా విభాగాలతో పాటు ఇతర సహాయక విభాగాల సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రేష్ఠత, నూతన ఆవిష్కరణలు, జట్టు కృషి, అంకితభావం, సుదీర్ఘ సేవానుభవాలను వేడుకగా జరుపుకున్నారు.తమ బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తించే వ్యక్తులు, బృందాలను గుర్తించే ఈ కార్యక్రమంలో, బాగా పనిచేసిన వారిని గుర్తించి అవార్డులతో సత్కరించడంతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బంది, సందర్శకులకు సేవ చేయడంలో తమ బృందాలు అచంచలమైన నిబద్ధత ద్వారా ప్రతిరోజూ ఒక అద్భుతాన్ని సృష్టిస్తాయన్నారు. యాజమాన్య స్ఫూర్తి, అభిరుచి, కరుణతో వారు అందరికీ నమ్మకమైన సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నట్టు చెప్పారు.ఒక గొప్ప సంస్థ యొక్క విజయం కేవలం విద్యా నైపుణ్యం పైనే కాకుండా, దాని లక్ష్యానికి మద్దతుగా నిస్వార్థంగా పనిచేసే వారి అంకితభావంపై కూడా ఆధారపడి ఉంటుందని విశ్వవిద్యాలయ నాయకత్వం అభిప్రాయపడింది. వర్సిటీ మంచి పనితీరు, అభివృద్ధికి కీలకమైన, పైకి పెద్దగా కనిపించని వ్యక్తుల కృషికి ముదిత ఒక నివాళ అని వారు ఉద్ఘాటించారు.ముదిత 4.0 అభినందన, సమ్మిళితత్వం, గౌరవం, విశిష్ట సేవా సంస్కృతిని పెంపొందించడానికి గీతం నిబద్ధతను పునరుద్ఘాటించింది. ఒక విశ్వవిద్యాలయం యొక్క నిజమైన బలం, ఆ ప్రాంగణాన్ని అభ్యసన, ఐక్యత, అభివృద్ధి, శ్రద్ధకు నెలవైన ప్రదేశంగా తీర్చిదిద్దడానికి దోహదపడే ప్రతి ఒక్కరి సమష్టి కృషిలోనే ఇమిడి ఉందనే శక్తివంతమైన సందేశంతో ఈ వేడుక ముగిసింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago