Telangana

పెండింగ్ లో ఉన్న భూసర్వే సమస్యలు వెంటనే పరిష్కరించాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్ చెరు మండలంలో పెండింగ్ లో ఉన్న భూ సర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ పటాన్ చెరు డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.  సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం తహసిల్దార్ నరహరి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ పటాన్ చెరు మండలంలో భూమి సర్వే సమస్యల పనులు గత రెండు సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలు నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయని ఆరోపించారు.. 2026 జనవరి నుంచి ఇప్పటివరకు దాదాపు 300 దరఖాస్తులు సమస్యలు పరిష్కారం చేయాలని విన్నవించుకుంటే, కేవలం 30 దరఖాస్తులు మాత్రమే ఎలా సర్వే సమస్యలు పరిష్కారం చేస్తారని ప్రశ్నించారు. అనేక సంవత్సరాలుగా భూమి సర్వే సమస్యలు, పౌతి మార్పిడి సమస్యల పరిష్కారం కోసం ప్రతి అంశంలో సర్వేయర్ పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా సర్వేర్ మాత్రం సర్వే మ్యాప్ లు ఇవ్వకుండా మండలంలో ఉన్న దరఖాస్తుదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రుద్రారం, లక్డారం, నందిగామ, ముత్తంగి, ఇంద్రేశం మరియు ఇతర గ్రామాలలో ఒక్కొక్క గ్రామం నుంచి 70 నుంచి 80 మంది దరఖాస్తులు చేసుకున్న నేటికీ పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ఒక్క ఆరు నెలల కాలంలోనే మండల సర్వేయాలు ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా, ఇలాంటి సమస్యలు పరిష్కారం చేస్తున్నారని ప్రశ్నించారు. అందుకోసం పటాన్ చెరు మండలంలో ఉన్న భూముల సర్వే, ఫౌతి మార్పిడి లో సర్వే సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మండల ప్రజల సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం చేస్తున్నామని మండల అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మల్లేష్, చంద్రయ్య, పోచయ్య లు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago