మనవార్తలు, శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో గల సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ సత్య సాయి బాబా వారి 96 వ జన్మదినం సందర్భంగా జరిగిన అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.
అనంతరం మాట్లాడుతూ సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించారు. అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుధ్ధ హృదయంతో జీవించాలనీ తమ ఉప న్యాసాల్లో బోధిస్తుంటారు.సత్య సాయి సేవా సంస్థల అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా నేటికీ జరుగుతుండటం విశేషం. పేద విద్యార్ధులకు సహకరించడం,వైద్య సేవలు, అనేక విధాలైన దాన కార్యక్రమాలు నేటికీ నిరాటంకం గా నడుస్తున్నాయి అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వాల హరీష్ , బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్ , మాధవరం గోపాల్ రావు,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు…
విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…
-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…
-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…
ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…