Telangana

జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష సమావేశం

_అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_బల్దియాలో శరవేగంగా అభివృద్ధి పనులు 

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

జిహెచ్ఎంసి పరిధిలోని వార్డులలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో జిహెచ్ఎంసి కార్పొరేటర్లు, బల్దియ అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి పరిధిలోని భారతి నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం డివిజన్ల పరిధిలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల 3 డివిజన్లో పరిధిలో సిసి రోడ్ల నిర్మాణానికి 22 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామన్నారు.అభివృద్ధి పనుల అమల్లో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు.అదేవిధంగా పెండింగ్ నిధుల మంజూరు, నూతన అభివృద్ధి పనుల నిధుల కోసం త్వరలోనే మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశం కానున్నట్లు తెలిపారు.జాతీయ రహదారిపై విద్యుత్ దీపాల నిర్వహణ సంతృప్తికరంగా లేదంటూ సంభందిత శాఖ అధికారులపై ఎమ్మెల్యే జిఎంఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.నూతన కాలనీలలో పారిశుధ్య నిర్వహణ కోసం నూతన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, సింధు ఆదర్శ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజనీరింగ్ శాఖ ఈఈ శంకర్ నాయక్, డిప్యూటీ కమిషనర్ సురేష్, అధికారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago