మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో
కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఒకరిని విధుల నుండి తొలగిస్తూ, మరో ఇద్దరు వైద్యాధికారులకు షోకాస్ నోటీసులుఅందించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , జిల్లా వైద్యధికారిణి ని ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లాలో మాతా శిశు మరణాలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్మనాజ్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో డాక్టర్ అజ్మనాజ్ ను విధులను తొలగించాలని డిఎం అండ్ హెచ్ ఓ గాయత్రి దేవి కి ఆదేశించారు. దౌల్తాబాద్ ,మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజు నోటీసులు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే లో రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందించేలా చూడాలన్నారు. హై రిస్కు కేసులో రెఫర్ చేస్తున్నప్పుడు డాక్టర్లు సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి వారికి సూచనలు సలహాలు, పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి గాయత్రి దేవి, జిజిహెచ్ సూపర్డెంట్ అనిల్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు పాల్గొన్నారు
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, కార్మిక వ్యతిరేక లేబర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో వెల్లడించిన ఏఆర్ సీఐ శాస్త్రవేత్త డాక్టర్ బులుసు శారద మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: శక్తి…