Telangana

ఐక్యమత్యంగా సాగితేనే గుర్తింపు నీలం మధు ముదిరాజ్

ముదిరాజ్ ల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

సబ్బండ వర్గాలు, మన జాతి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా
నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే గుర్తింపు సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నీలం మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రాజకీయ చైతన్యం అలవర్చుకోవాలన్నారు. రాజకీయ చైతన్యంతోనే జాతి మనుగడ సాధ్యమని వివరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్ ల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనతో ముదిరాజులకు మంచి రోజులు రానున్నాయని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు.

ముదిరాజుల సుదీర్ఘ డిమాండ్ అయిన బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే విషయంతో పాటు మత్స్యకార సంఘాలకు వడ్డీ లేని ఋణాలు, చేపల మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మరికొన్ని అంశాలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. దశలవారీగా మన హక్కులను సాధించుకుందామని అన్నారు. సబ్బండ వర్గాలు, ముదిరాజ్ జాతి అభివృద్ధికి శక్తివంచనా లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పెద్దలందరం కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కార సాధనకు కృషి చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్మోహన్, మాజీ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్, డీఎల్ పాండు, చేన్నవేని రాములు, సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చొక్కాల రాములు, చొప్పరి రామచంద్రం, రెడ్డబోయిన గోపి, హనుమండ్లు, వెంకటస్వామి, ముత్యాల శ్రీనివాస్, దేవరాజు, పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago