రథోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
వేల సంఖ్యలో తరలివచ్చిన ఒరిస్సా వాసులు, జగన్నాథుడి భక్తులు
బొల్లారం ,మనవార్తలు ప్రతినిధి :
పూరి జగన్నాథుడి విశ్వ ప్రసిద్ధ రథయాత్ర పురస్కరించుకుని బొల్లారం మున్సిపల్ పరిధిలో గల జగన్నాథుని ఆలయంలో నిర్వహించిన రథయాత్ర కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. రథయాత్ర కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేలాది భక్తుల జయ జయధ్వనుల మధ్య రథయాత్ర ప్రారంభమైంది.
ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. మినీ ఇండియా గా పేరుందిన బొల్లారం మున్సిపాలిటీలోని అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి పాటుపడుతున్నామని తెలిపారు.పూరి జగన్నాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల పండుగలను సమ ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…