పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆషాడ మాసంలో నిర్వహించే బోనాలను పటాన్చెరు పట్టణంలో జులై 21వ తేదీ సోమవారం నిర్వహించేందుకు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించినట్లు పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బోనాల పండుగ ఏర్పాట్లపై ఆదివారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధ్యక్షతన పట్టణ పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 21వ తేదీన నిర్వహించనున్న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున అన్ని దేవాలయాల వద్ద పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో.. ఆనందోత్సాహాల మధ్య పండుగను నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ పుర ప్రముఖులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…