Telangana

పాశమైలారం టీజీఐఐసీ హరితహారం పార్క్ భూమిని పరిరక్షించాలి: మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా కో-ఆప్షన్ మెంబర్, ఇస్నాపూర్ మున్సిపాలిటీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని 10 ఎకరాల టీజీఐఐసీ హరితహారం పార్క్ భూమిని పరిరక్షించాలని కోరుతూ ఇస్నాపూర్ మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్ మొహమ్మద్ నిజాముద్దీన్ బాబా జిల్లా స్థాయి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.2015లో తెలంగాణ హరితహారం కార్యక్రమం ప్రారంభమైన సమయంలో పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో 10 ఎకరాల భూమిని పార్క్ కోసం కేటాయించారు. ఈ ప్రదేశంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రస్తుతం పార్క్ భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు, అలాగే పార్క్ భూమి మీదుగా రహదారి నిర్మాణం జరిగినట్లు పేర్కొంటూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవ పరిస్థితిని నిర్ధారించాలని నిజాముద్దీన్ బాబా కోరారు.పార్క్ భూమికి సంబంధించిన సర్వే నంబర్లు, విస్తీర్ణం, హద్దులు, టీజీఐఐసీ ఆమోదించిన లేఅవుట్ తదితర రికార్డులను పరిశీలించి, రెవెన్యూ మరియు టీజీఐఐసీ అధికారులతో సంయుక్త సర్వే నిర్వహించాలని ప్రజావాణి ద్వారా కోరారు.అనధికార ఆక్రమణ లేదా రహదారి నిర్మాణం ఉన్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని, పార్క్ భూమిని ప్రజా ప్రయోజనం కోసం పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.భవిష్యత్తులో ఆక్రమణలకు అవకాశం లేకుండా పార్క్ భూమికి స్పష్టమైన హద్దులు, సర్వే రాళ్లు మరియు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

 

admin

Recent Posts

అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొన్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన బీఆర్ఎస్ ఇంచార్జ్ గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .ఇస్నాపూర్ మున్సిపల్…

3 hours ago

బీహెచ్ఈఎల్ టౌన్‌షిప్‌లో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

రామచంద్రపురం , మనవార్తలు ప్రతినిధి: మత సామరస్యం, సోదరభావంతో కూడిన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని…

6 hours ago

ఛట్ పూజ సందర్భంగా ఉత్తర భారతీయులకు చెరుకు పంపిణీ చేసిన మాద్రి పృథ్వీరాజ్

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర ఛట్ పూజను పురస్కరించుకుని యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో…

20 hours ago

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ

పటాన్‌చెరు, మనవార్తలు ప్రతినిధి: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక…

21 hours ago

శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా మహా చండీయాగం

ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి శివానందం దంపతులు రెండు వేల…

21 hours ago

తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ (తేనా)కు జాతీయ స్థాయి పురస్కారం

- సమాజాభివృద్ధికి అందించిన సేవలకు జాతీయ గుర్తింపు - పౌర సమస్యల పరిష్కారం, పర్యావరణ పరిరక్షణలో విశిష్ట కృషి -…

21 hours ago