_బి ఆర్ ఎస్ నేతలు ధరణి పేరుతో రైతులను దోచుకుంటున్నారు
పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ధరణి పోర్టల్ ద్వారా పేద రైతులు నష్టపోతున్నారని బీజేపీ నేత గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పటాన్ చేరు నియోజకవర్గంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని … రెవెన్యూ అధికారుల అండదండలతో ముఖ్యమంత్రి కేసిఆర్ నుండి మొదలుకొని బారస మంత్రులు, ఎమ్మెల్యేలు, గ్రామ స్థాయి నాయకుల వరకు అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారని ఆరోపించాడు.ధరణి పోర్టల్ లో ఉన్న రైతుల భూములకు సమస్యలను సృష్టించి వారే పరిష్కరిస్తున్నారని అయిన అన్నారు.సమస్యను పరిష్కరించడానికి పేద రైతులను అమయాకపు భూ యజమానులను భయబ్రాంతులకు గురిచేసి వారి భూములను అక్రమంగా ఆక్రమించి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.ప్రభుత్వం వెంటనే వారి సమస్యల్ని పరిష్కరించాలని లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాలు , మండల కార్యాలయాలు ,ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ధరణి సమస్యల పరిస్కారం కోసం భారతీయ జనతాపార్టీ తరపున పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. .
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, రాజ్ గోపాల్, దుర్గా సాయి, ఆదిత్య,నవిన్ తదితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…