Telangana

వినూత్న పరిష్కారాలతో విధాన నిర్ణయాలు

కౌటిల్య కాలోక్వీలో నిపుణుల సూచన

విజయవంతంగా ముగిసిన పబ్లిక్ పాలసీ వార్షిక సమావేశం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా విధానాన్ని రూపొందించడంలో అంతర్-విభాగ విధానాలు, వినూత్న పరిష్కారాలు, సహకార ప్రయత్నాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు. కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) మూడో వార్షిక సమావేశాన్ని ‘కౌటిల్య కాలోక్వీ’ పేరిట శనివారం విజయవంతంగా నిర్వహించింది. ‘అస్థిర, అనిశ్చిత, సంక్లిష్టమైన, అస్పష్టమైన (వీయూసీఏ) ప్రపంచం ద్వారా మార్గనిర్దేశనం’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ సదస్సు ప్రపంచ, జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆలోచనాపరులు, పండితులు (స్కాలర్లు) అభ్యాసకులు, విద్యార్థులను ఒకచోట చేర్చింది. రోజంతా జరిగిన ఈ కార్యక్రమంలో ప్యానెల్ చర్చలు, పత్ర సమర్పణ, నిర్ధిష్ట పనిని పూర్తిచేయడానికి నిర్ధేశిత సమయం (పాలసీ స్ప్రింట్) తదితరాలు ఉన్నాయి. జ్జాన మార్పిడి, విధాన ఆవిష్కరణలకు క్రియాశీలకమైన వేదికగా ఈ సమావేశం తోడ్పడింది.‘భారతదేశానికి ఫిన్ టెక్ – ముందుకు సాగే మార్గం’, ‘స్థిరమైన భవిష్యత్తు: వీయూసీఏ ప్రపంచంలో వాతావరణ విధానం’ పేరిట ప్యానెల్ చర్చలను నిర్వహించారు.

ఫిన్ టెక్ చర్చలో ఇండియా బ్లాక్ చైన్ ఫోరం అధ్యక్షుడు ప్రసన్న లోహర్, మాస్టర్ కార్డ్ దక్షిణాసియా అధిపతి అభిషేక్ లాహిరి, డీవీజీ గ్రూపు వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి రాఘవన్ వెంకటేశన్ పాల్గొన్నారు. ఈ చర్చలను కౌటిల్య అసిస్టెంట్ డీన్ (పరిశోధన) డాక్టర్ అమ రేంద్ర పాండే సమన్వయం చేశారు. స్థిరమైన భవిష్యత్తుపై జరిగిన చర్చలో క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తి ఖోస్లా, ఏథర్ ఎనర్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా మిత్రా, సస్టైనబిలిటీ సొల్యూషన్ రీసైకల్ లీడ్ డాక్టర్ స్వాతి సింగ్ పాల్గొన్నారు.

ఆయా చర్చలలో ప్రధానంగా వాతావరణ మార్పు, పర్యావరణ, సామాజిక పాలన (ఈఎస్జీ) కార్యక్రమం, ఆర్థిక వృద్ధి, సామాజిక సమానత్వం, పర్యావరణ బాధ్యతలను పరిశీలించడంతో పాటు కార్బన్ సుంకాలు, స్థిరమైన వాణిజ్య పద్ధతులు వంటి ప్రపంచ విధానాల గురించి చర్చించారు.ఆర్థిక స్థితిస్థాపకత, ఈఎస్జీ విధానాలు, డిజిటల్ గవర్నెన్స్, కృత్రిమ మేధస్సు (ఏఐ), జియోపాలిటిక్స్, సమ్మిళిత పాలన వంటి ఇతివృత్తాలపై విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు పరిశోధనా పత్రాలను సమర్పించారు.ఇక పాలసీ స్ప్రింట్ లో స్థిరత్వం, పట్టణ పాలన, సాంకేతిక అంతరాయంపై దృష్టి సారించి, వినూత్నమైన, ఆధార సహిత, అందుబాటులోని విధాన ప్రతిపాదనలను రూపొందించారు. అంతేగాక, జట్ల మార్గదర్శకత్వం, నిపుణుల అభిప్రాయం, విధాన అభ్యాసకులతో పరిచయాలను పొందారు.ఈ చర్చలు, చొరవల ద్వారా కార్యాచరణపై లోతైన అవగాహనతో పాటు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే విధాన సిఫార్సులను రూపొందించడానికి ప్రయత్నించారు. ఈ సమావేశం నుంచి వెలువడే ఆలోచనలు భవిష్యత్తు పద్ధతులను తెలియజేస్తాయని, సమ్మిళిత, డేటా-ఆధారిత, స్థిరమైన పాలన చట్రాలను పెంపొందిస్తాయని కేఎస్ పీపీ విద్యార్థులు భావిస్తున్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago