_పిజెఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
కార్మిక రంగానికి పిజెఆర్ చేసిన సేవలు మరువలేనివని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కార్మిక నాయకులు దివంగత పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామ పరిధిలోని కిర్బి పరిశ్రమ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీజేఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్మికులకు అన్నదానం నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు చేసిన మహోన్నత వ్యక్తి పి జె ఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, పరిశ్రమ ఎం డి పిలిప్పోస్, పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రాజమహేందర్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, జిల్లా అధ్యక్షుడు శివశంకరరావు, పాశ మైలారం గ్రామ సర్పంచ్ కృష్ణ, కార్మిక విభాగం నాయకులు మాధవరావు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు
రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో కన్నులపండువగా వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాలు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…
-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్ -అభినందించిన జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న 'యూరో కిడ్స్ స్కూల్'…