షిర్డీ:
ఎన్నో రోజులుగా షిర్డీ వెళ్లాలనుకుని ఎదురుచూసే బాబా భక్తులకు ఇది తీపి కబురు. కరోనా కారణంగా మూసివేసిన షిర్డీ ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. నవరాత్రుల తొలిరోజైన అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ఎస్‌ఎస్‌ఎస్‌టీ పేర్కొంది. అవేంటంటే..
* అక్టోబరు7 (గురువారం) నుంచి ప్రతిరోజూ 15 వేల భక్తులకు మాత్రమే సాయి దర్శనం లభిస్తుంది. ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేల ఆన్‌లైన్ పాసులు, 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉంటాయి. గంటకు దాదాపు 1,150 మంది షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవచ్చు.
* భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
* అదే విధంగా.. హారతి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
* గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించరు.
* 2020 మార్చి 17న కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ సాయిబాబా ఆలయం.. తొమ్మిది నెలల తరువాత నవంబర్ 16న తిరిగి తెరిచారు. అప్పట్లో రోజుకు 6000 మందికి దర్శనం కల్పించారు.
* ఆపై ఆ సంఖ్యను 14 వేల నుంచి 20 వేలకు పెంచారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5 తరువాత కరోనా కేసుల పెరుగుదల కారణంగా సాయిబాబు ఆలయాన్ని మరోసారి మూసేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దాదాపు ఏడు నెలల తరువాత ఆలయాన్ని తెరుస్తున్నారు
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…