పటాన్చెరు
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఈ నెల 14న బతుకమ్మ పండుగ, 15వ తేదీన దసరా పండుగను నిర్వహించాలని పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని కోదండ సీతారామస్వామి దేవాలయం లో పండగ తేదీలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు పాటిస్తూ పండగలు జరుపుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మను సాకి చెరువు కట్ట పైన, దసరా పండుగ రోజున జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో శమీ పూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు అందరూ ఎంతో ఇష్టంగా, భక్తి ప్రపత్తులతో నిర్వహించుకునే బతుకమ్మ పండుగ నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పై చేపడుతున్న పనులను స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్న నేపథ్యంలో ఫ్లడ్ లైట్లతో పాటు మంచినీటి సౌకర్యం, శానిటేషన్ సిబ్బంది ని ఏర్పాటు చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బల్దియా డిప్యూటీ కమీషనర్ బాలయ్య, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను నియోజకవర్గ ప్రజలందరు సంతోషంగా నిర్వహించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. బుధవారం నుండి బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణ లో ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు..ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…