Hyderabad

అక్టోబర్‌7 నుంచి  షిర్డీ సాయిబాబా దర్శనానికి అనుమతి

షిర్డీ: 

ఎన్నో రోజులుగా షిర్డీ వెళ్లాలనుకుని ఎదురుచూసే బాబా భక్తులకు ఇది తీపి కబురు. కరోనా కారణంగా మూసివేసిన షిర్డీ ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. నవరాత్రుల తొలిరోజైన అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ఎస్‌ఎస్‌ఎస్‌టీ పేర్కొంది. అవేంటంటే..

* అక్టోబరు7 (గురువారం) నుంచి ప్రతిరోజూ 15 వేల భక్తులకు మాత్రమే సాయి దర్శనం లభిస్తుంది. ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేల ఆన్‌లైన్ పాసులు, 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉంటాయి. గంటకు దాదాపు 1,150 మంది షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవచ్చు.
* భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.

* అదే విధంగా.. హారతి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
* గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించరు.

* 2020 మార్చి 17న కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ సాయిబాబా ఆలయం.. తొమ్మిది నెలల తరువాత నవంబర్ 16న తిరిగి తెరిచారు. అప్పట్లో రోజుకు 6000 మందికి దర్శనం కల్పించారు.
* ఆపై ఆ సంఖ్యను 14 వేల నుంచి 20 వేలకు పెంచారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5 తరువాత కరోనా కేసుల పెరుగుదల కారణంగా సాయిబాబు ఆలయాన్ని మరోసారి మూసేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దాదాపు ఏడు నెలల తరువాత ఆలయాన్ని తెరుస్తున్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

6 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

6 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago