Districts

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు_బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

మనవార్తలు , పటాన్ చెరు:

బీజేపీ అంటేనే మచ్చ లేని పార్టీ ,

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాషాయ జెండా

బీజేపీ పార్టీలో వలసల జోరు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ వరి కొనుగోలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతుందని బండి సంజయ్ గుర్తు చేశారు రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గోల్కొండా కీళ్ల మీద భారతీయ జెండా రెప రెప లాడుతుందని ,బీజేపీ అంటే కేసీఅర్ కు భయం పట్టుకుందని రాబోయే ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని బండి సంజయ్ అన్నారు ఉద్యోగాల కోసం ఈ నెల 27 న ధర్నా చౌకేలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే తన తల నరుక్కుంటానన్న బండి సంజయ్.. హామీలు నెరవేర్చుకోకుంటే ముఖ్యమంత్రి తల నరుక్కుంటారా అని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాబుమోహన్ ,పటాన్చెరు మాజీ ఎమ్యెల్యే నందీశ్వర్ గౌడ్ ,ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago