పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో జరిగిన పెద్దమ్మ తల్లి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించి అమ్మ వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాలలో జరిగే ఉత్సవాలు,ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి భావం పెరుగుతుందన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు,ఈ కార్యక్రమంలో నెల్లి రాజు,జంగిటి మోహన్,ఆకుల రాజు,కాశం శ్రీనివాస్,దాకం యాదగిరి,కాశం మల్లేశం,రాము, గ్రామ పెద్దలు, ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు, ఎన్,ఎం,ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…