మనవార్తలు , పటాన్ చెరు:
నేటి మధ్యాహ్నం నారాయణఖేడ్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగసభకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలోని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ కాన్వాయ్ గా బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గం నుండి పదివేల వేల మంది కార్యకర్తలు ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.
కెసిఆర్ సభకు తరలి వెళ్లిన పటాన్చెరు టిఆర్ఎస్ మహిళా శ్రేణులు
నేడు నారాయణఖేడ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యఅతిథిగా జరగనున్న భారీ బహిరంగ సభకు పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల మంది మహిళలు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా యాదమ్మ మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి అనునిత్యం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పటాన్చెరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు వెళుతోంది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, జెడ్ పి టి సి లు సుప్రజ వెంకట్ రెడ్డి, ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు రోజా బాల్ రెడ్డి, లలితా సోమిరెడ్డి, ఎంపీటీసీ నీన చంద్రశేఖర్ రెడ్డి, మాధవి, అరుంధతి, భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…