Districts

పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించిన గీతం పూర్వవిద్యార్థిని…

మనవార్తలు , పటాన్ చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ బీటెక్ పూర్వ విద్యార్థిని ( 2016-20 ) శివాలి జోహ్రి శ్రీవాస్తవ , ఆమె తల్లి కవిత జోహ్రి శ్రీవాస్తవ , తండ్రి అనిల్ శ్రీవాస్తవలు పద్నాలుగో గిన్నిస్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించారు . హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒకేచోట ఉంచిన ఈ కుటుంబం , అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు . చిన్నపాటి రంగు కాగితాన్ని కూడా కళాత్మకంగా మలచగల నేర్పు శివాలీ కుటుంబానికి వరంగా మారింది . ఏకంగా విశ్వ యవనికపై విజయకేతనం ఎగురవేయడానికి తోడ్పడింది . అదీ ఏదో ఒకటీ .. రెండూ .. కాదు , ఏకంగా 14 గిన్నిస్ రికార్డులు , 15 అసిస్ట్ వరల్డ్ రికార్డులతో పాటు పది యూనిక్ వరల్డ్ రికార్డులు . హెదరాబాద్ లోని ఒకే కుటుంబం ఇన్ని గిన్నిస్లు కలిగి ఉండడం కూడా మరో రికార్డుగా వినుతికెక్కడం విశేషం . ఇంతకు మునుపు , శివాలి కుటుంబం హ్యాండ్ మేడ్ పేపర్తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలను కొలువుతీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది .

ఆ తరువాత 7,011 విభిన్న కాగితం పువ్వులను ప్రదర్శించి మలి రికార్డు , 2,111 విభిన్న బొమ్మలు , 3,501 ఆరెగామి వేల్స్ , 2,100 ఆరెగామి పెంగ్విన్స్ , 6,132 ఆరెగామి సిట్రస్ ( నిమ్మ తొన ) లు , 6,100 అరెగామి వేల్స్ , 2,500 ఆరెగామి పెంగ్విన్స్ , 1,451 ఆరెగామి మాష్లీలు , 2,200 క్విల్లింగ్ డాల్స్ , 9,200 ఆరెగామి ఫిష్ , 1,993 అరెగామి మాష్లీ లీవ్స్ , 2,200 క్విల్లింగ్ డాలలను ప్రదర్శనకు ఉంచి ఇప్పటివరకు 13 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న విషయం విదితమే . మొత్తం 14 గిన్నిస్ రికార్డులను సాధించిన శివాలి ,

ఆమె తల్లిదండ్రులను గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , డెరైక్టర్ – ఇంజనీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్ , స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్ . సీతారామయ్య , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , స్కూల్ ఆఫ్ ఫార్మశీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ కుమార్ , స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ , గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్ , వివిధ విభాగాధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది , విద్యార్థులు తదితరులు అభినందించారు .

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago