పటాన్ చెరు శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు
శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఈనెల 25 తేదీ నుండి 29వ తేదీ వరకు పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆదివారం ఉదయం దేవాలయం ఆవరణలో పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ కోదండ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ప్రజలు, భక్తుల సహకారంతో ప్రతి ఏటా ఐదు రోజుల పాటు వేద మంత్రోచ్ఛరణాల మధ్య భక్తుల జయ జయ ధ్వనాలతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తేదీన వేలాది మంది భక్తుల సమక్షంలో అభిజిత్ లగ్న సుముహూర్తమున శ్రీ సీతారామచంద్రస్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించబోతున్నట్లు తెలిపారు.ఐదు రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాలను దిగ్విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారుఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అర్చక స్వామి నరసింహచార్యులు, సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, పృథ్వీరాజ్, అశోక్, వెంకటేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…