Andhra Pradesh

హీరోయిన్ ఈషా రెబ్బ చేతుల మీదుగా గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం*

▪️  54వ బ్రాంచీ లాంచ్ చేసిన ‘కలర్స్ హెల్త్‌కేర్’*

▪️  అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక*

▪️  అత్యుత్తమ టెక్నాలజీతో ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సేవలు*

గాజువాక: ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉందని, అందుకోసం యువత ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ప్రముఖ వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్ ఏర్పాటుచేసిన నూతన బ్రాంచ్ ‘కలర్స్ 2.0’ను గాజువాకలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతంలో తాను రెండు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు చెప్పారు. పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం అందం సిద్ధిస్తుందన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ అత్యంత అవసరమని పేర్కొన్నారు. బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. కలర్స్ సంస్థ సేవలు ఇప్పటికే అనేక మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, గాజువాకలో బ్రాంచ్ ప్రారంభించడం తమకు ఆనందంగా ఉందన్నారు. తాను ఇక్కడే గాజువాకలో టీఎస్ఆర్ టీబీకే కళాశాలలో చదువుకున్నానని, గాజువాక వాసులకు ఎప్పుడు తన ప్రాధాన్యత సేవలు అందుతాయి అని చెప్పారు. అందరికీ ఉపయోగపడేలా బరువు తగ్గుదల గురించి తాము సేవలు అందించడం ఎంతో సంతోషం అన్నారు. పదిమందికి ఉపయోగపడేది అందరికీ ప్రయోజనకారిగా ఉండే విధంగా తమ సేవలు కొనసాగుతాయ‌ని చెప్పారు. శారీరకంగా ఒక బరువు తగ్గడం అనేది, 90 రకాల కు పైగా ఇబ్బందులు తగ్గిస్తుందన్నారు. తమ కలర్స్ లో 250 మందికి పైగా న్యూట్రిసినిస్ట్, 100 మందికి పైగా నిపుణులైన వైద్యులు , 2000 మంది సుశిక్షితులైన టెక్నీషియన్స్ ఉన్నారని, 22 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని వివరించారు.

మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవంతో నమ్మకాన్ని సంపాదించిన కలర్స్, ఇప్పుడు మరింత ఆధునిక సేవలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ తమ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, కలర్స్‌ను ఉత్తమ వెల్నెస్ క్లినిక్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. బరువు తగ్గడం, ఆరోగ్య సంరక్షణ, అందం పరిరక్షణలో ప్రత్యేక సేవలను అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 51 మంది డెర్మటాలజిస్టులతో సేవలు అందిస్తున్న ఏకైక వెల్నెస్ సంస్థగా కలర్స్ ప్రత్యేకత సాధించిందని అన్నారు.

.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

7 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago