Telangana

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్‌చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

ఛట్ పూజ సందర్భంగా 20 వేల మంది ఉత్తర భారతీయులకు ఏడు లారీల చెరుకు పంపిణీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా పటాన్చెరు నియోజకవర్గం నిలుస్తోందని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఉత్తర భారతీయులు ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుని ఛట్ పూజ పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని పటాన్చెరు, ఇస్నాపూర్, పాశమైలారం, బొల్లారం, రామచంద్రాపురం, అమీన్పూర్, గుమ్మడిదల ప్రాంతాలలో నివసిస్తున్న 20 వేల మంది ఉత్తర భారతీయులకు ఏడు లారీల చెరుకును సొంత నిధులతో కొనుగోలు చేసి ఎమ్మెల్యే జిఎంఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఉపాధి కోసం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పరిశ్రమలలో పనిచేస్తూ స్థానికంగా నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరి సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో సైతం తగు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా పటాన్చెరువు సాకి చెరువు కట్ట పైన ఛట్ పూజ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago