Telangana

క్రీడలకు వేదికగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఘనంగా ప్రారంభమైన ఎస్జీఎఫ్ క్రీడోత్సవాలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

క్రీడలకు కేంద్రంగా పటాన్చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్స్ గేమ్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడోత్సవాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని కోరారు. క్రీడల ద్వారా శారీరకదారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో ఉపయోగపడతాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఏడాది పొడవునా వివిధ అంశాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో, యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మండల విద్యాధికారి రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఎస్.జి.ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి గోసుద్దిన్, సీనియర్ నాయకులు అఫ్జల్, ప్రమోద్ గౌడ్, వెంకటేష్, మల్లారెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, ఇమ్రాన్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago